అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన నాయకులను పోలీసులు శనివారం తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేశారు. ఇందల్వాయి మండల తీజ్ కమిటీ (Indalwai Mandal Teej Committee) వేసుకొని మండల కేంద్రంలో తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తారని సమాచారం మేరకు వారిని ముందస్తుగా అరెస్టు చేసినట్లు సమాచారం.
మండల కేంద్రంలో గిరిజనులు (tribals) జగదాంబ సేవాలాల్ గద్దెలు నిర్మించిన స్థలం వివాదాస్పదంగా మారడంతో.. అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తే సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో మండలంలోని ముఖ్య నాయకులను ముందస్తు అరెస్టు (pre-arrested) చేసినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో మాజీ ఎంపీపీ రమేశ్ నాయక్, జిల్లా సదర్ నాయక్ రాజు నాయక్, ఏఐబీఎస్ మండల అధ్యక్షుడు తుకారం నాయక్, యువజన సంఘం నాయకుడు సతీష్, మోతిలాల్ నాయక్, సీతారాం నాయక్ తదితరులు అరెస్టు చేశారు.