అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (CCS constable Pramod) హత్యపై, ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ సంఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. వారి పిల్లలను ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రమోద్ చిన్న కుమారుడు, ప్రమోద్ తల్లికి అనారోగ్యానికి గురయ్యారని.. వారికి ప్రభుతమే వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. పోలీసుల ఎన్ కౌంటర్లో (police encounter) చనిపోయిన రియాజ్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలన్నారు. సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నారాయణరావు, రాష్ట్ర నాయకులు వి.సంగం, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బాలయ్య, అల్గోట్ రవీందర్, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి జలంధర్, సీనియర్ నాయకులు, న్యాయవాదులు ఎడ్ల రాము, వీర భద్రప్ప పాల్గొన్నారు.