అక్షరటుడే, ఇందూరు: TRESA | నిజామాబాద్ కలెక్టర్‌గా వినయ్ కృష్ణారెడ్డి (Nizamabad Collector Vinay Krishna Reddy) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అమలు చేస్తున్న భూభారతితో (Bhubarathi) పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ట్రెసా (Telangana Revenue Employees Service Association) జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు, భాస్కర్, నిజామాబాద్ నార్త్ మండల తహశీల్దార్ విజయ్‌కాంత్ రావు తదితరులున్నారు.
