అక్షరటుడే, ఇందూరు: TRESA | ఇటీవల ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్‌రెడ్డిని (Sudarshan Reddy) తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఆదివారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనతో మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ (Revenue Department), ఉద్యోగులకు సంబంధించి పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఉద్యోగులు, శాఖాపరమైన అంశాల్లో ట్రెసాకు తన మద్దతు ఎల్లవేళలా ఉంటుందని సుదర్శన్ రెడ్డి తెలిపినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, సభ్యులు పాల్గొన్నారు.
