ePaper
More
    HomeతెలంగాణTrending Dialogue | ట్రెండింగ్ లో ‘రప్పా రప్పా’.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్

    Trending Dialogue | ట్రెండింగ్ లో ‘రప్పా రప్పా’.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trending Dialogue | పుష్పా-2 సినిమాలోని డైలగ్ ‘రప్పా రప్పా’ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics) ఈ డైలగ్ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఈ పదం తొలుత వైరల్ అయింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోనే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు వెళ్లారు . ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలు రాష్ట్రంలో దుమారం రేపాయి. పుష్పా-2 సినిమాలోని (Pushpa-2 Movie) ఫేమస్ డైలాగ్ ‘రప్పా రప్పా నరుకుడే. వచ్చేది జగన్ 2.0’ అని ముద్రించిన ఫ్లెక్సీలతో జగన్ ఫ్యాన్స్ హల్ చల్ చేశారు. దీనిపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, జగన్ తన అనుచరులకు మద్దతుగా మాట్లాడడం మరింత వివాదాస్పదమైంది.

    ఇక, ఈ ‘రప్పా రప్పా’ డైలాగ్ (Rappa Rappa dialogue) ఏపీ నుంచి తెలంగాణకు పాకింది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పాల్గొన్న ధర్నా కార్యక్రమంలోనూ ‘రప్పా రప్పా’ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ‘రప్పా రప్పా వచ్చేది బీఆర్ఎస్ 3.0 (BRS 3.0) ప్రభుత్వమే’ అన్న పోస్టర్లతో గులాబీ శ్రేణులు హల్ చల్ చేశాయి. అటు నల్లగొండలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) కార్యక్రమంలోనూ ఇలాంటి ఫ్లెక్సీలే కనిపించాయి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ డైలాగ్ ను తాజాగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి (Nizamabad MP Arvind Dharmapuri) కూడా వినియోగించడంతో చర్చనీయాంశమైంది. నిజామాబాద్ లో విలేకరులతో మాట్లాడిన అర్వింద్.. పదేళ్లలో అవినీతికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబ సభ్యులను ‘గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా’ జైలులో పడేయాలని వ్యాఖ్యానించారు. అర్వింద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఈ డైలాగ్ ను వాడడంతో ప్రస్తుతం ‘రప్పా రప్పా’ హల్ చల్ చేస్తోంది.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...