అక్షరటుడే, గాంధారి : Thunderstorm | కామారెడ్డి kamareddy జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి గాలివాన Thunderstorm బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గాంధారి gandhari మండలంలో గాలివానకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సిబ్బంది రాత్రివరకు శ్రమించి విద్యుత్ electricity సరఫరాను పునరుద్ధరించారు. కానీ పలు చోట్ల రోడ్డుపై చెట్లు విరిగి పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముప్పాజీవాడ గ్రామంలో ఓ చెట్టు కూలి రోడ్డుపై పడటంతో రాకపోకలకు ఇబ్బంది అవుతోంది.