అక్షరటుడే, లింగంపేట: Lingampet | రెండురోజులుగా కురిసిన వర్షానికి మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్(Lingampet Police Station) సమీపంలో కేకేవై రహదారిపై భారీ మర్రి వృక్షం నేలకొరిగింది. కాగా, భారీ వృక్షాలకు నిప్పు.. పొంచి ఉన్న ముప్పు అనే శీర్షికన ఇటీవల ‘అక్షరటుడే’లో (Akshara Today) కథనం ప్రచురితమైంది. అయినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెండురోజులుగా వర్షం కురవడంతో ఆదివారం మర్రి చెట్టు (Banyan Tree) విరిగిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన ఎస్సై ప్రదీప్‌కుమార్ (SI Pradeep Kumar) చేరుకుని విరిగిపడిన చెట్టును తొలగింపజేశారు. దీంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. ఇప్పటికైనా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
