6
అక్షరటుడే, ఎల్లారెడ్డి:Yellareddy | ఈదురుగాలుల దాటికి అర్ధరాత్రి రోడ్డుపై కూలిన చెట్టును పోలీసులు తొలగించారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్(Yella Reddy Police Station) పరిధిలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి మార్గంలో ఓ పెద్ద మర్రి చెట్టు రోడ్డుపై కూలిపోయింది. ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి పోలీసులు(Yella Reddy Police) రాత్రి శ్రమించి దానిని తొలగించారు. కట్టింగ్ మిషన్, జేసీబీ సాయంతో చెట్టును తొలగించారు. ఎల్లారెడ్డి పోలీసులను ఎస్పీ రాజేశ్ చంద్ర(SP Rajesh Chandra) అభినందించారు.