అక్షరటుడే, ఇందూరు: Transport Department | రహదారులపై మూలమలుపులో ఉన్న చెట్ల కొమ్మలను పిచ్చి మొక్కలను తొలగించాలని రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని మాక్లూర్, ఆర్మూర్ (Makloor and Armoor roads) రహదారులను శనివారం రవాణా శాఖ, ఆర్ అండ్ బీ (Transport and R&B department) అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీటీవో మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Transport Department | డ్రైవర్లకు ఇబ్బందులు ఉండకుండా..
ప్రధానంగా డ్రైవర్లకు స్పష్టంగా కనిపించే విధంగా కొమ్మలను తొలగించాలన్నారు. అలాగే మూలమలుపుల్లో వాహనాలు జారకుండా చూడాలన్నారు. రాత్రి వేళలో రోడ్డు కనబడే విధంగా రిఫ్లెక్ట్ పెయింట్ వేయాలని తెలిపారు. అలాగే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. డీటీవో వెంట ఏఎంవీఐలు పవన్ కళ్యాణ్, శృతి, వాసుకి తదితరులు పాల్గొన్నారు.