అక్షరటుడే, వెబ్‌డెస్క్: Travels Bus Fire Accident | ఆంధ్రప్రదేశ్‌లోని AP కర్నూలు జిల్లా Kurnool district శివారులో ఉన్న చిన్నటేకూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.
ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ భయానక ఘటనలో సుమారు 25 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం శుక్రవారం (అక్టోబరు 24) తెల్లవారుఝామున సుమారు 3.30 గంటల సమయంలో చోటుచేసుకుంది.
కర్నూల్ Kurnool జిల్లా చిన్నటేకూరు శివారులో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో 25 మందికిపైగా ప్రయాణికులు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 12 మంది తీవ్రంగా గాయపడగా, కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Travels Bus Fire Accident | ఎలా జరిగింది ఈ ప్రమాదం?
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కర్నూలు నగర శివారు ఉలిందకొండ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. బస్సు వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో.. బైక్ Bike నేరుగా బస్సు కిందకు దూసుకెళ్లింది. బస్సు ఇంధన ట్యాంకును ఆ బైక్ తాకడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని అగ్నిజ్వాలలు చుట్టుముట్టాయి. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా లేచి చూసే సరికి బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది.
పలువురు ఎమర్జెన్సీ డోర్ ద్వారా, కిటికీల నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, మరికొందరు మంటల్లో చిక్కుకుని బయటపడలేక ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కర్నూలు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది.
ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ Hyderabad నగరానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన, అధికారుల ద్వారా ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. సీఎస్‌తోపాటు ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
“ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందేలా చూడండి..” అని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ ఘటనపై ప్రజలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరగడం పట్ల స్థానికులు షాక్‌కి గురయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
