అక్షరటుడే, ఇందూరు: Nizamabad CP | ప్రజలు ప్రభుత్వ రవాణా సంస్థను వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు.
దసరా (Dussehra) సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక లక్కీడ్రా బాక్స్‌లను బుధవారం ఆర్ఎం కార్యాలయంలో తీశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పండుగను పురస్కరించుకొని ప్రయాణికులకు బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు.
అనంతరం ఆర్ఎం జ్యోత్స్న మాట్లాడుతూ.. ప్రతి ప్రయాణికుడి సహకారమే సంస్థ విజయానికి మూలాధారం అన్నారు. దసరాకు విధించిన లక్ష్యాన్ని ప్రయాణికుల సహకారంతో ఛేదించామని తెలిపారు. అనంతరం విజేతలను ప్రకటించారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, పీవో పద్మజ, ఏవో పరమాత్మ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆనంద్ బాబు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.
Nizamabad CP | విజేతలు వీరే..
పండుగ సందర్భంగా బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులకు నగదు బహుమతులను (Cash prizes) అందజేశారు. మొదటి విజేతగా చంద్రయ్య (రూ.25 వేలు), రెండో విజేతగా షేక్ బాబర్ (రూ.15 వేలు), మూడో విజేతగా రాంప్రసాద్ (రూ.10 వేలు) నిలిచారు.