Homeజిల్లాలుకామారెడ్డిTravel buses | రోడ్డుపై డ్రమ్ములను ఢీకొట్టిన ట్రావెల్​ బస్సు.. మద్యం మత్తులో డ్రైవింగే కారణం

Travel buses | రోడ్డుపై డ్రమ్ములను ఢీకొట్టిన ట్రావెల్​ బస్సు.. మద్యం మత్తులో డ్రైవింగే కారణం

భిక్కనూరు సమీపంలో ఒంగోలుకు చెందిన ట్రావెల్​ బస్సు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై స్పీడ్​ కంట్రోల్​ కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములను బస్సు ఢీకొంది.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Travel buses | ప్రధాన రహదారులపై బస్సు ప్రమాదాలు తగ్గడం లేదు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వరుస ఘటనలు చూస్తున్నా డ్రైవర్లలో మార్పు రావడం లేదు. తాజాగా భిక్కనూరు మండలంలో (Bhiknoor mandal) స్పీడ్ కంట్రోల్ కోసం రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఓ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి బెంగళూరు (Adilabad to Bangalore) వైపు వెళ్తున్న ఒంగోలుకు చెందిన కామాక్షి ట్రావెల్స్ బస్సు శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భిక్కనూరుకు చేరుకుంది. అక్కడ సిద్ధరామేశ్వర నగర్ (Siddarameshwara Nagar) వద్దకు రాగానే డ్రైవర్ అజాగ్రత్తతో రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ఒకవైపు ఒరిగింది. దాంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. డ్రైవర్ బత్తుల రమేష్​కు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా అధికంగా మద్యం సేవించి బస్సు నడుపుతున్నట్టు తేలింది. వెంటనే ప్రయాణికులను ఇతర బస్సులో తరలించి బస్సును సీజ్ చేశారు. డ్రైవర్​తో పాటు ట్రావెల్స్​పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమన్నారు.

Must Read
Related News