అక్షరటుడే, అమరావతి: Travel Bus Accident | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూల్ Kurnool జిల్లాలో ఇటీవల ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ Vemuri Kaveri Travels బస్సులో మంటలు వ్యాపించి 19 మంది దుర్మరణం చెందారు.
ఈ దారుణ ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఏలూరు జిల్లా Eluru district లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద సోమవారం (నవంబరు 3) రాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
ఈ విషాదకరమైన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు భారతి ట్రావెల్స్ (Bharathi Travels) కు చెందినదిగా గుర్తించారు. ప్రమాదం జరిగేటప్పుడు ట్రావెల్ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
Travel Bus Accident | హైదరాబాద్ వస్తుండగా..
ఏలూరు నుంచి హైదరాబాద్ Hyderabad వస్తుండగా సదరు బస్సు ప్రమాదానికి గురైంది. కాగా, ప్రయాణికులు తీవ్రంగా గాయపడినందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
