అక్షరటుడే, ఇందూరు: Transport Department | రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు (inter-state checkposts) మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు చెక్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని రవాణా శాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల (Deputy Transport Commissioner Durga Pramila) ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద ఉన్న ఫర్నిచర్, రశీదులు, పరికరాలు కంప్యూటర్లను కార్యాలయంలో అప్పజెప్పాలని పేర్కొన్నారు.
Transport Department | ఇకపై ఆన్లైన్లో అనుమతులు..
అంతర్రాష్ట్ర అనుమతులకు సంబంధించిన సేవల కోసం ఇకపై ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పేర్కొన్నారు. అలాగే చెక్‌పోస్టుల (check posts) వద్ద భారీకేడ్లు, బోర్డులు తొలగించి, సేవలకు సంబంధించిన లభ్యత వివరాలను ప్రదర్శించాలని సిబ్బందికి ఆదేశించారు. ఇకపై చెక్‌పోస్టుల సేవలను www.transport.telangana.govin వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు. చెక్‌పోస్టుల్లో వాహనాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, భౌతిక అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ఉమ్మడిజిల్లాలో మూడు చెక్‌పోస్టులు ఉన్నాయి.
