Homeక్రైంNizamabad City | జీవితంపై విరక్తితో ట్రాన్స్​జెండర్ ఆత్మహత్య

Nizamabad City | జీవితంపై విరక్తితో ట్రాన్స్​జెండర్ ఆత్మహత్య

జీవితంపై విరక్తితో ట్రాన్స్​జెండర్​ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | జీవితంపై విరక్తి చెంది ఓ ట్రాన్స్​జెండర్​ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలో ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Sub-Inspector Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన ట్రాన్స్​జెండర్​ మీర కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

దీంతో జీవితంపై విరక్తి చెందిన మీరా మంగళవారం నిజామాబాద్​–జానకంపేట్​ (Nizamabad-Janakampet) రైల్వేస్టేషన్​ వద్ద గుర్తు తెలియని రైలుకు అడ్డువెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు రైల్వే పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.