SI Transfers
SI Transfers | కమిషనరేట్​ పరిధిలో ఎస్సైల బదిలీలు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: SI Transfers | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో ఎస్సైల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

మొత్తం తొమ్మిది మందిని ట్రాన్స్​ఫర్​ చేశారు. ఇందులో భాగంగా.. టి.గోవింద్​ను ఆర్మూర్​ నుంచి సీసీఎస్​ నిజామాబాద్​కు పంపించారు. సిలివేరి మహేష్​ను నిజామాబాద్​ నాల్గో టౌన్ ​(Nizamabad Fourth Town) నుంచి సీసీఎస్​ నిజామాబాద్​కు బదిలీ చేశారు. గంగుల మహేష్​ను వీఆర్​ నుంచి సీసీఎస్​ నిజామాబాద్​కు అటాచ్​ చేశారు. గురుక మహేష్​ను వీఆర్​ నుంచి ఒకటో టౌన్​ పీఎస్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు.

సామ శ్రీనివాస్​ను సౌత్​ రూరల్​ నుంచి నిజామాబాద్​ రూరల్​ ఎస్సై–2గా బదిలీ చేశారు. మొగులయ్యను ఒకటో టౌన్​ నుంచి మాక్లూర్​ పీఎస్​ రెండో ఎస్సై–2గా పంపించారు. వీఆర్​లో ఉన్న కె.వినయ్​కుమార్​ను ఆర్మూర్​ పీఎస్​కు బదిలీ చేశారు. సాయన్​ గౌడ్​ను వీఆర్​ నుంచి సీఎస్​బీ నిజామాబాద్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. వీఆర్​లో ఉన్న బీబీఎస్ రాజును కలెక్టరేట్​కు అటాచ్​ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.