అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | జిల్లా వైద్యశాఖలో (District Medical Department) బదిలీలు చోటు చేసుకున్నాయి. జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిగా కొనసాగుతున్న చంద్రశేఖర్ బదిలీ అయ్యారు. ఆయనకు వికారాబాద్ సివిల్ సర్జన్(ఆర్ఎంవో)గా పోస్టింగ్ ఇచ్చారు.
దోమకొండ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్న ప్రభు దయా కిరణ్ (Prabhu Daya Kiran) హైదరాబాద్ పబ్లిక్ హెల్త్ జాయింట్ డైరెక్టర్‌గా నియామకమయ్యారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులలో ఎవరిని నియమించలేదు. అలాగే కామారెడ్డి జీజీహెచ్ సివిల్ సర్జన్‌గా (Civil Surgeon of Kamareddy GGH) రవీందర్ గౌడ్ రానున్నారు. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చోంగ్థు ఉత్తర్వులు జారీ చేశారు.
