HomeతెలంగాణInspector Transfers | పలువురు సీఐల బదిలీ.. ఉత్తర్వులు జారీ

Inspector Transfers | పలువురు సీఐల బదిలీ.. ఉత్తర్వులు జారీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Inspector Transfers | మల్టీ జోన్​ –1 పరిదిలో పలువురు సీఐలు బదిలీ (CI Transfers) అయ్యారు. మొత్తం పది మంది ఇన్​స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఐజీ చంద్రశేఖర్​రెడ్డి (IG Chandrasekhar Reddy) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లూప్​లైన్​లో ఉన్న కొందరికి పోస్టింగ్​లు ఇవ్వగా.. కీలక పోస్టింగ్​ల్లో ఉన్న వారిని ఆయా బాధ్యతల నుంచి తప్పించారు.

పాలకుర్తి సీఐ మహేందర్​రెడ్డిని మహబూబాబాద్​ టౌన్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న పెండ్యాల దేవేందర్​ను ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. ట్రాన్స్ కోలో ఉన్న కందరి వినోద్​ను డిచ్పల్లి సీఐగా.. అక్కడ పని చేస్తున్న కొంక మల్లేశ్​ను ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. రామగుండం ఎస్​బీలో ఉన్న కరుణాకర్​ను జగిత్యాల టౌన్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా.. అలాగే అక్కడ పనిచేస్తున్న వేణుగోపాల్​ను ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు.

చెన్నూర్​ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ సుధాకర్​ను​ జగిత్యాల రూరల్ సీఐగా.. అక్కడ పనిచేస్తున్న కృష్ణారెడ్డిని ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. అలాగే వెయిటింగ్​లో ఉన్న మహేశ్​ను మెదక్​ టౌన్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా నియమించారు. అక్కడ కొనసాగుతున్న కొమళ్ల నాగరాజును ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. బదిలీ అయిన వారు అంతా సత్వరమే తమ నూతన పోస్ట్​లలో రిపోర్ట్​ చేయాలని ఐజీ ఆదేశించారు.

Must Read
Related News