అక్షరటుడే, వెబ్‌డెస్క్:Tahsildar Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) పలువురు తహశీల్దార్లను బదిలీ tahasildars transfers చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గత అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) ముందు ఇతర జిల్లాలకు బదిలీ చేసిన తహశీల్దార్లను ఎట్టకేలకు సొంత జిల్లాలకు పంపించింది. తమను సొంత జిల్లాలకు పంపాలని కొంతకాలంగా తహశీల్దార్లు(Tahsildars transfers Telangana) కోరుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మల్టీ జోన్–1 పరిధిలో 55 మంది తహశీల్దార్లను, మల్టీ జోన్–2 పరిధిలో 44 మందిని ట్రాన్స్ఫర్ చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో కూడా పలువురు తహశీల్దార్లు బదిలీ అయ్యారు.
జగిత్యాల జిల్లాలో పని చేస్తున్న వీర్‌సింగ్, ప్రసాద్, ముజిబుద్దీన్ నిజామాబాద్‌కు బదిలీపై రానున్నారు. అలాగే నిజామాబాద్ నుంచి మాలతి మెదక్‌కు, మల్లయ్య సిరిసిల్లకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కామారెడ్డిలో పని చేస్తున్న హిమబిందు నిర్మల్‌కు, సతీష్‌రెడ్డి నిజామాబాద్ వెళ్లనున్నారు. నిర్మల్ పనిచేస్తున్న జానకి, పెద్దరాజు కామారెడ్డి రానున్నారు. నిజామాబాద్‌లో పని చేస్తున్న నాగరాజ్‌కు జగిత్యాలకు, ప్రభాకర్, గజానన్ నిర్మల్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. శ్రీనివాస్ నిర్మల్ నుంచి నిజామాబాద్‌కు, రహిముద్దీన్ కామారెడ్డి నుంచి ఆసిఫాబాద్‌కు, సునీత నిజామాబాద్ నుంచి కామారెడ్డికి, ఆంజనేయులు నిజామాబాద్ నుంచి పెద్దపల్లికి బదిలీ అయ్యారు.