HomeతెలంగాణInspectors Transfers | పలువురు పోలీస్​ ఇన్​స్పెక్టర్ల బదిలీ

Inspectors Transfers | పలువురు పోలీస్​ ఇన్​స్పెక్టర్ల బదిలీ

Inspectors Transfers | మల్టీ జోన్​–1 పరిధిలో పలువురు ఇన్​స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఐజీ చంద్రశేఖర్​రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురికి స్థాన చలనం కలిగించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inspectors Transfers | పలువురు పోలీసులు ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మల్టీ జోన్​ –1 పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి (IG Chandrasekhar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు.

వి. వినయ్​కుమార్​ను ఖమ్మం కమిషనరేట్​ పరిధిలోని వైరా సీఐగా నియమించారు. కాగా వినయ్​కుమార్​ ప్రస్తుతం వెయిటింగ్​లో ఉన్నారు. గతంలో టీజీసీఎస్​బీ ఇన్​స్పెక్టర్​గా డిప్యుటేషన్​పై పంపగా.. ఆ ఉత్తర్వులను రద్దు చేసి వైరాకు ట్రాన్స్​ఫర్​ చేశారు. అక్కడ పని చేస్తున్న ఎన్​ సాగర్​ను మల్టీ జోన్​–1 కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఐజీ ఆదేశించారు. కామారెడ్డి పోలీస్​ కంట్రోల్​ రూమ్​లో పని చేస్తున్న తుల శ్రీధర్​ను బాన్సువాడ ఎస్​హెచ్​వోగా నియమించారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మందాల అశోక్​ను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.