అక్షరటుడే, వెబ్‌డెస్క్: Police transfers | రాష్ట్ర ప్రభుత్వం పలువురు నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivdhar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 32 మంది ఐపీఎస్ అధికారులను (32 IPS officers) బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 9 మంది నాన్ కేడర్ ఎస్పీలకు స్థాన చలనం కలిగించింది.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా (Hyderabad Cyber Crime DCP) అరవింద్ బాబు నియమితులయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా ధార కవిత బదిలీ అయ్యారు. పెద్దపల్లి డీసీపీగా పని చేస్తున్న పి కరుణాకర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పని చేస్తున్న వైవీఎస్ సుదీంద్ర సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌కు (Cyberabad Special Branch) బదిలీ అయ్యారు. అక్కడ పని చేస్తున్న సాయి శ్రీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు వెళ్లారు.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఎస్వీఎన్ శివరాం (ACB Joint Director SVN Sivaram) ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ట్రాన్స్‌కోలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న జగదీశ్వర్ రెడ్డి ఇంటెలిజెన్స్ విభాగానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇంటెలిజెన్స్‌లో పని చేస్తున్న ఎం రవీందర్‌రెడ్డి గ్రే హౌండ్స్ కమాండర్‌గా, హైడ్రా అడిషనల్ కమిషనర్ అశోక్ కుమార్ సీఐడీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. బదిలీ అయిన వారిని వెంటనే రిలీవ్ చేయాలని డీజీపీ ఆదేశించారు.
