అక్షరటుడే, హైదరాబాద్: IPS Transfers : తెలంగాణ (Telangana state) రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లు ips transfers బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని పలువురు సీనియర్, జూనియర్ ఐపీఎస్‌లను తెలంగాణ ప్రభుత్వం (Telangana government) బదిలీ చేసింది. వెయింటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇవ్వడంతోపాటు కీలక పోస్టుల్లో కొనసాగుతున్న వారికి ఉద్వాసన పలికింది. మొత్తం ఏడుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెయిటింగ్ లో ఉన్న అభిలాష బిస్త్ ips abhilasha bisht తెలంగాణ పోలీస్ అకాడమీ (Telangana Police Academy derictor) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. శిఖా గోయల్‌కు ips shikha goel సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Cyber Security Bureau director) డైరెక్టర్‌గా, టీజీ ఎఫ్ఎస్ఎల్(TG FSL) డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఏడీజీగా చారు సిన్హాను charu sinha as cid ADG నియమించారు. తఫ్సీర్ ఇక్భాల్ ips tafseer iqubal జోన్ -6 (చార్మినార్) డీఐజీగా నియమితులయ్యారు.
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ ఉన్న శ్రీనివాస్‌రావును మెదక్‌కు బదిలీ చేశారు. సౌత్ ఈస్ట్ జోన్(South East Zone scp) డీసీపీ పాటిల్ కంటిలాల్ సుభాష్‌ను ips patil kantilal Subhash కొమరంభీమ్ ఆసిఫాబాద్ ఎస్పీగా నియమించారు. హైదరాబాద్ సిటీ ఎస్బీ డీసీపీ చైతన్యకుమార్‌ను సౌత్ ఈస్ట్ జోన్ కు బదిలీ చేశారు.