ePaper
More
    HomeతెలంగాణInspectors Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

    Inspectors Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inspectors Transfers | మల్టీ జోన్​ –1(Multi Zone -1) పరిధిలో పలువురు ఇన్​స్పెక్టర్లు బదిలీ (Inspectors Transfers) అయ్యారు.

    మొత్తం ఏడుగురు ఇన్​స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్​–1 ఐజీ చంద్రశేఖర్​రెడ్డి (IG Chandrashekar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి టౌన్​ ఎస్​హెచ్​వోగా బి. నరహరి నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్​రెడ్డిని ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు.

    అలాగే ఐజి కార్యాలయంలో వెయిటింగ్​లో ఉన్న ప్రభాకర్​ను నార్నూల్​ సర్కిల్​ ఇన్​స్పెక్టర్​గా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న రహీమ్​ పాషాను రామగుండం కమిషనరేట్​ వీఆర్​కు అటాచ్​ చేశారు. వెయిటింగ్​లో ఉన్న మాధవి ప్రసాద్​ను ఉట్నూర్​ సర్కిల్ కు​ బదిలీ చేసి.. అక్కడ పనిచేస్తున్న జి మురళిని నిర్మల్ డీసీఆర్బీకి బదిలీ చేశారు. అలాగే రామగుండం వీఆర్​లో ఉన్న భీమేశ్​​ను రామగుండం ఎస్​బీ సీఐగా నియమించారు. కాగా.. బదిలీ అయిన అధికారులు నూతన పోస్టింగుల్లో చేరాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులో పేర్కొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...