అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inspector Transfers | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలువురు పోలీస్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం 50 మంది సీఐ (CI)లను బదిలీ చేశారు. వారు తక్షణమే రిలీవై కొత్త పోస్టింగ్‌ల్లో చేరాలని ఆయన ఆదేశించారు. దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి దోమలగూడ ఎస్‌హెచ్‌వో (Domalaguda SHO) నుంచి స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. మహ్మద్ అంజాద్ అలీ ఎస్బీ నుంచి దోమలగూడకు, జోగేశ్వరరావు నల్లకుంట పీఎస్ నుంచి ఎస్బీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. మారుతి ప్రసాద్ సీటీసీ నుంచి నల్లకుంటకు వచ్చారు. చంద్ర శేఖర్ ఉత్తరపల్లి నారాయణగూడ పీఎస్ నుంచి ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ అయ్యారు. సైదేశ్వర్ ఎస్బీ నుంచి నారాయణగూడకు వెళ్లారు.
పరుశురాం కుక్కుడపు మహంకాళి ఠాణా నుంచి సీటీసీకి, రమేశ్‌గౌడ్ చిలకలగూడ నుంచి మహంకాళి పీఎస్‌కు, చప్పిడి శ్రీను బొల్లారం పీఎస్ నుంచి సీఎస్డబ్ల్యూకి బదిలీ అయ్యారు. మొత్తం 50 మందికి అధికారులు స్థానచలనం కలిగించారు.