అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు (IAS) బదిలీ అయ్యారు. 8 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అభివృద్ధి సంక్షేమ పథకాల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సభ్యసాచి ఘోష్, రవాణా శాఖ కమిషనర్ గా ఇలాంబర్తి నియమితులయ్యారు. జీఏడీ పొలిటికల్ ఇన్‌ఛార్జి సెక్రెటరీగా ఈ శ్రీధర్, గురుకుల సంక్షేమ కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్‌ఛార్జి సెక్రెటరీగా సీఎస్ రామకృష్ణారావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయిల్ ఫెడ్ ఎండీగా యాస్మిన్ భాష, ఎస్సీ డెవలప్మెంట్ స్పెషల్ కమిషనర్‌గా జితేందర్ రెడ్డి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రత్యేక కార్యదర్శిగా సైదులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది.

