Tahsildars Transfers
Tahsildars Transfers | ఇద్దరు తహశీల్దార్ల బదిలీ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deputy Tahsildars Transfer | రాష్ట్రంలో పలువురు డిప్యూటీ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. జోన్​–1, 2, 3 పరిధిలోని 2‌‌3 మంది డీటీలను బదిలీ చేస్తూ ​సీసీఎల్​ఏ చీఫ్​ కమిషనర్​ నవీన్​ మిట్టల్ శనివారం​ ఆదేశాలు జారీ చేశారు. జోన్​–1 పరిధిలో ఐదుగురు, జోన్​–2 పరిధిలో 16 మంది, జోన్​–3 పరిధిలో ఇద్దరిని ట్రాన్స్​ఫర్​ చేశారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. త్వరలోనే బదిలీ అయిన నాయబ్​ తహశీల్దార్లు తమతమ స్థానాల్లో రిపోర్ట్​ చేయనున్నారు.

డీటీల అభ్యర్థన మేరకు..

లోక్​సభ ఎన్నికల సందర్భంగా పరిపాలనా కారణాలతో అప్పట్లో తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి వారు ఆ ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. తిరిగి తమ పాత స్థానాలకు పంపాలని సీసీఎల్​ను వారు అభ్యర్థించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన సీసీఎల్​ఏ చీఫ్​ కమిషనర్​ జోన్-1, 2, 3లలో బదిలీలు నిర్వహించి ఉత్తర్వులు జారీ చేశారు.