అక్షరటుడే, వెబ్డెస్క్: Constable Transfers | నిజామాబాద్ కమిషనరేట్(Nizamabad police commissionerate) పరిధిలో భారీగా కానిస్టేబుళ్లు బదిలీ(constables Transfers) అయ్యారు. 116 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ సీపీ సాయిచైతన్య(Cp Saichaitanya) ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లుగా ఒకే చోట ఉన్న వారికి స్థానచలనం కల్పించారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాయిచైతన్య తన మార్కు చూపిస్తున్నారు. అధికారులు, సిబ్బంది పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన అవినీతి ఆరోపణలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించడం లేదు. ఇప్పటికే ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే కొందరిని బదిలీ చేశారు. కాగా.. సుదీర్ఘ కాలంగా ఒకే చోట కొనసాగుతున్న వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


