అక్షరటుడే, కామారెడ్డి: Police Transfers | జిల్లాలో ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లను బదిలీ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో బదిలీ అయిన కానిస్టేబుళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విల్లింగ్ స్టేషన్లు (Willing stations), స్పౌస్, సీనియారిటీని, ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డును పరిగణనలోకి తీసుకొని కౌన్సిలింగ్ పద్ధతిలో 35 మంది సివిల్, ఏడుగురు ఏఆర్ కానిస్టేబుళ్లను పారదర్శకంగా బదిలీ చేయడం జరిగిందన్నారు.
Police Transfers | పోలీస్ ఉద్యోగంలో క్రమశిక్షణ ముఖ్యం..
పోలీస్ ఉద్యోగంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని ఎస్పీ తెలిపారు. ఒక్కరి తప్పు మొత్తం శాఖపై ప్రభావం చూపిస్తుందన్నారు. అందువల్ల కానిస్టేబుళ్లు జాగ్రత్తగా, నిజాయితీతో విధులు నిర్వహించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. తమకు కేటాయించిన విభాగాల్లో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి(Additional SP Narasimha Reddy), ఏఆర్ డీఎస్పీ యాకూబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, ఆర్ఐలు నవీన్ కుమార్, కృష్ణ, కానిస్టేబుళ్లు అధికారులు పాల్గొన్నారు.