HomeతెలంగాణTransco | లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాం

Transco | లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాం

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి:Transco | మండల పరిధిలోని గౌరారం సబ్​స్టేషన్(Sub Station)​ పరిధిలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించినట్లు ట్రాన్స్​కో ఎస్​ఈ రవీందర్(Transco SE Ravinder)​ పేర్కొన్నారు. సోమవారం సబ్​స్టేషన్​లో రూ.కోటితో అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ ట్రాన్స్​ఫార్మర్(Tranformer)​​ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​(Summer Action Plan)లో భాగంగా అదనపు ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేయడం ద్వారా గౌరారం, లింగాపూర్​, జీకే తండాలో విద్యుత్​ సరఫరాలకు ఇబ్బందులు తప్పనున్నాయన్నారు. కార్యక్రమంలో ఏఈ జ్ఞానేశ్వర్​, డిచ్​పల్లి డీఈ అల్జాపూర్​ రమేశ్​, డీఈ ఎంఆర్​టీ వెంకటరమణ, ఏడీఈ ఎస్​పీఎం నటరాజ్​, ఏఈ టీఆర్​ఈ సాయిలు తదితరులు పాల్గొన్నారు.