అక్షరటుడే, బోధన్: Bodhan Sub-Collector | బీఎల్వోలకు (BLO) ఓటర్ల డాటా మ్యాపింగ్‌పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నియోజకవర్గంలోని తహశీల్దార్లతో తన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. నియంత్రణ పట్టిక, ఓటర్ల డేటా మ్యాపింగ్ (SIR) అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన తహశీల్దార్లకు పలు సూచనలు చేశారు. వారి సంబంధిత మండలాల్లోని బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమాలు (BLO training programs) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే బీఎల్వోలకు ఓటర్ల డేటా మ్యాపింగ్‌కు సంబంధించిన విధానాలపై మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించారు. అదనంగా ఆయన పోలింగ్ స్టేషన్ల వారీగా 2002 ఓటర్ల స్థిర నివేదికలను కూడా సమీక్షించి చర్చించారు. కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.