Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | మహిళా సమాఖ్య కార్యకలాపాలపై శిక్షణ

Yellareddy | మహిళా సమాఖ్య కార్యకలాపాలపై శిక్షణ

ఎల్లారెడ్డిలో మహిళా సమాఖ్య కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చారు. ఏపీఎం రాంనారాయణ్​ గౌడ్​ ఆధ్వర్యంలో మహిళలకు సమాఖ్యలో నిర్వహించే పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో (Womens Federation Office) సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండోరోజు శనివారం పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఏపీఎం రాంనారాయణ్​ గౌడ్​ (APM Ramnarayan Goud) ఆధ్వర్యంలో సమాఖ్య సమావేశాలు, హాజరు, పుస్తక నిర్వహణ, రికార్డుల భద్రత, కార్యాలయాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు.

అలాగే బ్యాంక్ లింకేజ్ కమిటీ (Bank Linkage Committee), పర్యవేక్షణ కమిటీ, జండర్ కమిటీ, ఆస్తుల పరిశీలన కమిటీ, అప్పుల రికవరీ కమిటీ పనితీరుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు పావని, సీఆర్పీలు శోభారాణి, నాగశ్రీ, వివిధ గ్రామ సంఘాల పదాధికారులు, సీసీలు, మండల సమాఖ్య అకౌంటెంట్​ మహేష్​ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News