అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Training camp | నగరంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో (zilla parishad government school) ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ ఐదు రోజుల పాటు కొనసాగుతుందని పాఠశాల హెచ్ఎం శంకర్ తెలిపారు. బోధనా పద్ధతులు మెరుగుపరుచుకోవడం, సబ్జెక్టుల్లో నిపుణత సాధించడం, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ పాఠ్యాంశాల బోధన తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణకు 300 మంది ఉపాధ్యాయులు హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.