4
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | స్థానిక సంస్థల ఎన్నికలు (Local body elections) సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో సోమవారం రైతు వేదికలో (raithu Vedika) పీవో, ఏపీవోలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఎంపీడీవో ప్రకాష్, ఎంఈవో రాజులు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికలను పక్షపాతం లేకుండా నిబంధనల మేరకు జరిగేలా చూడాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు.