అక్షరటుడే, హైదరాబాద్: 2024 batch trainee IASs : తెలంగాణ కేడర్(Telangana cadre)కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Telangana cadre)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ముఖ్యమంత్రి, బాధ్యతల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రిని కలిసిన సౌరభ్ శర్మ (Saurabh Sharma), సలోని ఛబ్రా (Saloni Chhabra), హర్ష చౌదరి (Harsha Choudhary), కరోలిన్ చింగ్తియన్మావి (Carolyn Chingthianmawi), కొయ్యడ ప్రణయ్ కుమార్ (Koyyada Pranay Kumar) ప్రస్తుతం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(Dr. Marri Chennareddy Human Resource Development Center)లో శిక్షణ పొందుతున్నారు.
జూబ్లీహిల్స్(Jubilee Hills)లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో సీఎం సలహాదారు వేం.నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, Dr. MCRHRD వైస్-ఛైర్‌పర్సన్ శాంతి కుమారి, కోర్సు డైరెక్టర్ ఉషారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.