అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | భీమ్గల్ మున్సిపాలిటీలో మూడు వారాలపాటు శిక్షణను పూర్తి చేసిన ట్రెయినీ ఐఏఎస్ అధికారి కరోలిన్ చింగ్తియాన్మావిని (Trainee IAS officer Caroline Chingtianmavi) శుక్రవారం పురపాలక కార్యాలయంలో (Municipal Office) సత్కరించారు. కమిషనర్ గోపు గంగాధర్ శాలువా కప్పి, బొకే అందజేశారు.
ఈ సందర్భంగా ట్రెయినీ ఐఏఎస్ మాట్లాడుతూ.. శిక్షణలో మున్సిపల్ చట్టాలు, పరిపాలనా విధానాలను క్షుణ్ణంగా పరిశీలన చేసే అవకాశం లభించిందన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీ సిబ్బంది, స్థానిక ప్రజలు అందించిన సహకారం మరిచిపోలేనిదని ఆమె వ్యాఖ్యానించారు. అనంతర కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ ట్రెయినీ ఐఏఎస్ శిక్షణకు వచ్చిన సమయంలో మున్సిపాలిటీలోని కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, భీమ్గల్ మున్సిపాలిటీలో ఐఏఎస్ అధికారి శిక్షణకు రావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ షబ్బీర్, మున్సిపల్ ఏఈ శ్రీ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.