అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bharath Electronic Jobs | బెంగళూరుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Ltd) తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని కోట్‌ద్వార్ యూనిట్‌లో పనిచేయడానికి ఆసక్తిగలవారినుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
Bharath Electronic Jobs | పోస్టుల వారీగా వివరాలు..
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 51.
ట్రైనీ ఇంజినీర్-1 : 50 (ఇందులో ఎలక్ట్రానిక్స్ 30, మెకానికల్ 17, ఎలక్ట్రికల్ 01, సివిల్ 02 పోస్టులున్నాయి)
ట్రైనీ ఆఫీసర్-1(ఫైనాన్స్) : 01.
విద్యార్హత : ట్రైనీ ఇంజినీర్ (Trainee Engineer)కు పోస్టుకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసినవారు, ట్రైనీ ఆఫీసర్(Trainee Officer)కు ఎంబీఏ/ఎంకాం ఉత్తీర్ణులు అర్హులు.
వయోపరిమితి : 28 ఏళ్లలోపు వారు అర్హులు.
వేతనం : నెలకు మొదటి ఏడాది రూ. 30 వేలు, రెండో ఏడాది రూ. 35 వేలు, మూడో ఏడాది రూ. 40 వేలు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము : రూ.150. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు గడువు తేదీ : జనవరి 15.
ఎంపిక విధానం : విద్యార్హతలు, ఇంటర్వ్యూ/రాత పరీక్ష ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష/ఇంటర్వ్యూ తేదీ : జనవరి 25.
ఇంటర్వ్యూ వేదిక : ఉత్తరాఖండ్‌లోని కొట్‌ద్వార్, పారీ గర్వాల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్
పూర్తి వివరాలకు https://bel-india.in వెబ్‌సైట్‌లో సంప్రదించగలరు.