అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ask DISHA 2.0 | ప్రయాణికులకు అందించే సేవలను మరింత సులభతరం చేయడం కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC).. లేటెస్ట్ ఏఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ ఆస్క్ దిశ 2.0 ను తీసుకొచ్చింది. ట్రైన్ టికెట్ల(Train tickets)ను బుక్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా రీఫండ్ స్టేటస్‌లను తనిఖీ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆస్క్ దిశ 2.0 చాట్‌బాట్‌ను (Ask Disha 2.0 chatbot) యాక్సెస్ చేయవచ్చు. వాయిస్ కమాండ్స్ సాయంతోనూ కావాల్సిన సమాచారం పొందవచ్చు. ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ (English, Hindi and Gujarati) భాషలలో కమాండ్‌లను ఉపయోగించి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. IRCTC పాస్వర్డ్ అవసరం లేకుండానే ఓటీపీ ద్వారా బుకింగ్స్ పూర్తి చేయొచ్చు. టికెట్ క్యాన్సిల్ లేదా ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు రిఫండ్(Refund) కూడా చాలా వేగంగా జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులో ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా భవిష్యత్తులో వేగంగా ట్రైన్ బుకింగ్ చేసుకోవచ్చు.
Ask DISHA 2.0 | టికెట్ బుకింగ్ ఇలా..
- ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (Website) లేదా మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే కింది భాగంలో కుడివైపు ఆస్క్ దిశ 2.0 చాట్‌బాట్ కనిపిస్తుంది.
- అక్కడ హలో లేదా టికెట్ బుక్ టైప్ అని చేయాలి. వాయిస్ కమాండ్(Voice command)లను ఉపయోగించి కూడా చాట్ ప్రారంభించవచ్చు. స్టేషన్, గమ్యస్థానం, ప్రయాణ తేదీ, తరగతి(స్లీపర్, 3ఏసీ, 2ఏసీ) తదితర వివరాలు ఎంటర్ చేయాలి. అందుబాటులో ఉన్న రైళ్ల జాబితా, టైమింగ్స్, సీట్లు మొదలైనవాటిని అది చూపిస్తుంది. ఇందులో మనకు కావాల్సిన ట్రైన్, క్లాస్, సీటు మొదలైనవాటిని ఎంచుకోవాలి.
- చాట్‌బాట్ (Chat bot) వివరాలను ధ్రువీకరించిన అనంతరం ఓటీపీ ధ్రువీకరణతో చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది.