ePaper
More
    HomeజాతీయంTrain Accident | ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు

    Train Accident | ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Train Accident | ఒడిశాలో రైలు ప్రమాదం(Train Accident Odisha) చోటు చేసుకుంది. సంబల్‌పూర్‌లోని తంగర్‌పాలి సమీపంలో షాలిమార్-సంబల్‌పూర్ రైలు చివరి కోచ్ పట్టాలు తప్పింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

    రైలు చివరి కోచ్ పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసులు(Railway Police), అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు(Railway Officers) దర్యాప్తు జరుపుతున్నారు.

    Train Accident | నెమ్మదిగా వెళ్తుండటంతో

    సంబల్పూర్ సిటీ స్టేషన్((Sambalpur City Station) సమీపంలో షాలిమార్-సంబల్పూర్ మహిమా గోసైన్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు తూర్పు కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. రైలు గార్డు వ్యాన్(Train Guard Van) పక్కన ఉన్న జనరల్ కోచ్ వెనుక ట్రాలీ పట్టాలు తప్పిందన్నారు. ఆ సమయంలో చాలా నెమ్మదిగా వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. లేదంటే మిగతా కోచ్​లు కూడా పట్టాలు తప్పే అవకాశం ఉందన్నారు. అయితే పట్టాలు తప్పడానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదు. అనంతరం ఆ కోచ్​ను తొలగించి మిగతా రైలును యథావిథిగా పంపించారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...