Homeఆంధప్రదేశ్Guntur Train | రైలులో దారుణం.. ప్రయాణికురాలిపై అత్యాచారం

Guntur Train | రైలులో దారుణం.. ప్రయాణికురాలిపై అత్యాచారం

కదులుతున్న రైలులో ఓ మహిళపై దండుగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Guntur Train | రైలులో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిపై (female passenger) ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. కత్తితో బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు- పెదకూరపాడు (Guntur-Pedakurapadu) రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది.

ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన ఓ మహిళ (35) సోమవారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో (Rajahmundry railway station) సంత్రగాచి స్పెషల్ రైలులో ఎక్కారు. ఆమె మహిళా బోగీలో ఎక్కారు. హైదరాబాద్​లోని చర్లపల్లి స్టేషన్​లో దిగి ఇళ్లలో పని చేసుకోవాలని ఆమె భావించింది. అయితే రైలు గుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న సమయంలో బోగీలో ఉన్న మిగిలిన ప్రయాణికులు అందరు దిగిపోయారు. దీంతో ఆమె ఒక్కరే బోగీలో ఉన్నారు. ఆ సమయంలో 40 ఏళ్ల వ్యక్తి అదే బోగీలో ఎక్కాడు.

Guntur Train | రైలు కదలగానే..

సదరు వ్యక్తి బోగీలో ఎక్కడానికి యత్నించగా.. మహిళా వద్దని వారించింది. ఇది మహిళల బోగీ (women’s coach) అని చెప్పింది. సదరు వ్యక్తి ఆమెను బతిమిలాడి రైలులో ఎక్కాడు. అనంతరం రైలు కదలగానే.. నిందితుడు డోర్లు మూసి వేశాడు. కత్తితో బెదిరించి మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె దగ్గర ఉన్న రూ.5,600 నగదు, సెల్‌ఫోన్, హ్యాండ్‌బ్యాగును లాక్కొని దాడి చేశాడు.

రైలు పెదకూరపాడు స్టేషన్‌కు చేరుకుంటుండగా ఆగక ముందే దిగి పారిపోయాడు. మంగళవారం రైలు చర్లపల్లి స్టేషన్​కు (Cherlapalli station) చేరుకున్న అనంతరం బాధితురాలు సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వారు కేసును నడికుడి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేశారు. పెదకూరపాడు స్టేషన్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.