అక్షరటుడే, వెబ్‌డెస్క్: New Year Celebrations | తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. అయితే పలుచోట్లు న్యూ ఇయర్ వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి.మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. బుధవారం రాత్రి ప్రజలు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు.
కోటి ఆశలతో 2026కు వెల్కమ్ చెప్పారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నగరాల నుంచి మొదలు పెడితే గ్రామాల ప్రజలు అర్ధరాత్రి పూట సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. అయితే వేడుకల్లో పలువురు మృతి చెందారు.
New Year Celebrations | బిర్యాని తిని ఒకరి మృతి
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాని నగర్లో కొంత మంది నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో బిర్యాని తిన్నారు. అది తిని పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా.. మరో 15 మందికి అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
New Year Celebrations | గోదావరిలో యువకుల గల్లంతు
న్యూ ఇయర్ వేళ విహార యాత్ర విషాదంగా మారింది. కాకినాడ (Kakinada)కు చెందిన ముగ్గురు యువకులు థార్ కారులో కొత్త సంవత్సర వేడుకల కోసం అంతర్వేది బీచ్‌కు వెళ్లారు. అంతర్వేది అన్నా-చెల్లెళ్ల గట్టు వద్ద వీరి కారు గోదావరిలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకుల గల్లంతు కాగా.. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
New Year Celebrations | చికెన్ కోసం గొడవ
కర్నూలు జిల్లా (Kurnool District) మంత్రాలయం మండలం బూదూరులో చికెన్ కోసం ఘర్షణ జరిగింది. తనకు ముందు కావాలంటే తనకు ముందు కావాలని చికెన్ షాపు వద్ద కొందరు గొడవ పడ్డారు. దీంతో నరేష్ అనే వ్యక్తి ముగ్గురిపై చికెన్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో విజయ్, చిన్న, గాబ్రేలు అనే వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.