ePaper
More
    Homeక్రైంHyderabad | పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి

    Hyderabad | పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్(Hyderabad)​ నగర శివారులోని దుండిగల్​ విషాదం చోటు చేసుకుంది. తల్లితో కలిసి స్కూటీపై బడికి వెళ్తున్న బాలుడు టిప్పర్(Tipper)​ కింద పడి చనిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్​ పోలీస్​ స్టేషన్​(Dundigal Police Station) పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

    ఓ తల్లి ఒకటో తరగతి చదువుతున్న తన కుమారుడిని బడిలో దింపడానికి స్కూటీపై బయలు దేరింది. దుండిగల్ పరిధిలోని మల్లంపేటలో గల పల్లవి అంతర్జాతీయ పాఠశాల(International School) ఎదుట స్కూటీని టిప్పర్​ ఢీకొంది. దీంతో బాలుడు టిప్పర్​ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లి దూరంగా పడడంతో గాయాలతో బయట పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...