Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | రోడ్డుప్రమాదం మిగిల్చిన విషాదం.. నలుగురు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి..

Kamareddy | రోడ్డుప్రమాదం మిగిల్చిన విషాదం.. నలుగురు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి..

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో బుధవారం నలుగురు మృతి చెందిన విషయం విదితమే. అయితే వారికి సంబంధించిన పోస్టుమార్గం గురువారం పూర్తి కాగా తల్లీబిడ్డల మృతదేహాలను ఖమ్మంకు తరలించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జంగంపల్లి 44వ జాతీయ రహదారిపై (National Highway 44) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందడం పలువురిని కలిచివేసింది. బాధితుల కుటుంబాల్లో విషాదం నింపింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలకు గురువారం జీజీహెచ్​లో పోస్టుమార్టం పూర్తయ్యింది.

తన చిన్న కుమారుడు జడ్సన్​కు టీకా వేయించడం కోసం తండ్రి, ఇద్దరు పిల్లలతో కలిసి జస్లిన్​ స్కూటీపై వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను కామారెడ్డి జీజీహెచ్​లో (Kamareddy GGH) పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గురువారం ఉదయం పోలీసులు పంచనామా పూర్తి చేసి పోస్టుమార్టంనకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12:30 వరకు నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. కామారెడ్డి రూరల్ సీఐ రామన్, భిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు ఉదయం నుంచి పోస్టుమార్టం పూర్తయి మృతదేహాలను తరలించే వరకు ఆస్పత్రి వద్దే ఉన్నారు.

పోస్టుమార్టం పూర్తవగానే జస్లిన్, జోయల్ ప్రకాష్, జోయల్ జడ్సన్ మృతదేహాలను ఖమ్మంకు తరలించారు. బాలకిషన్ మృతదేహాన్ని కామారెడ్డిలోని ఆయన నివాసానికి అంత్యక్రియలు చేసేందుకు పంపించారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన తెలుసుకున్న పాస్టర్లు, ఇతరులు పెద్దఎత్తున జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల బంధువుల రోదనలతో ఆస్పత్రి ఆవరణ విషాదంతో నిండిపోయింది. భార్య, పిల్లల మృతితో జస్లిన్ భర్త ప్రకాష్ రోదన అందరినీ కలిచివేసింది.