అక్షరటుడే, పెద్దకొడప్గల్: Tragedy in Vadlam Village | మండలంలోని వడ్లం గ్రామంలో విషాదం నెలకొంది. వేర్వేరు ఘటనల్లో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు మృతి చెందారు.
Tragedy in Vadlam Village | ఇస్త్రీ చేస్తూ ఒకరు..
వడ్లం గ్రామానికి చెందిన ముచ్కూరి నాగయ్య కౌలాస్ ప్రాజెక్ట్‌లో(Kaulas Nala Project) లస్కర్ ఉద్యోగం చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం ఉద్యోగానికి వెళ్లే క్రమంలో దుస్తులను ఇస్త్రీ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
బీరువాలో దుస్తులు సర్దుతూ ఒకరు..
అదే గ్రామానికి చెందిన పసుపుల లక్ష్మి ఇంట్లోని బీరువాలో దుస్తులు సర్దుతుండగా.. బీరువాకు విద్యుత్ సరఫరా కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి (Banswada Area Hospital) తరలించారు. కుటుంబ సభ్యులు సావిత్రి, సత్యవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. అయితే గ్రామస్థులు స్థానిక విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజులుగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు జరుగుతున్నాయని.. పరిశీలించాలని కోరినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారని వారు వాపోయారు.