అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Railway Station | రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) నగరంలోని రైల్వేస్టేషన్లో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే ఆర్‌హెచ్‌సీ హన్మాండ్లు (Railway RHC Hanmandlu) తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేస్టేషన్లో ఉదయం ఫ్లాట్‌ఫాం నం.3 నుంచి రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి కాలుజారి ఫ్లాట్‌ఫాంకు రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
Nizamabad Railway Station | రైల్వేస్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు..
రైల్వేస్టేషన్ మేనేజర్ కిరణ్‌కుమార్ (Manager Kiran Kumar) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసుమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ (Railway Head Constable) హన్మాండ్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి కుడిచేతికి ఒక వేలు లేదని.. సమాచారం కోసం రైల్వే కానిస్టేబుల్ 8712568440ను సంప్రదించాలని కోరారు.