Homeఆంధప్రదేశ్Srikakulam Stampede | శ్రీకాకుళంలో విషాదం.. ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది భక్తుల మృతి

Srikakulam Stampede | శ్రీకాకుళంలో విషాదం.. ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది భక్తుల మృతి

శ్రీకాకుళంలో జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మరణించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srikakulam Stampede | ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళంలో జిల్లా (Srikakulam District) లో విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయం (Venkateswara Swamy Temple)లో శనివారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కార్తీక మాసం (Karthika Masam) కావడంతో ప్రస్తుతం ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం ఏకదాశి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో రెయిలింగ్​ ఊడిపోయి భక్తులు కిందపడ్డారు. దీంతో తొక్కిసలాట (Stampede) చోటు చేసుకోగా.. 9 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

 Srikakulam Stampede | సమగ్ర విచారణ

తొక్కిసలాట ఘటనతో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో పలువురు చిన్నారులు సైతం ఉన్నారు. ఆలయంలో అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు.

Must Read
Related News