అక్షరటుడే, వెబ్‌డెస్క్: Punjab : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో amritsar punjab విషాదం చోటుచేసుకుంది. మజిత ప్రాంతంలో సోమవారం రాత్రి కల్తీ మద్యం adulteration of liquor తాగి 14 మంది మరణించారు. మరో ఆరుగురు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండు కేసులు నమోదు చేశారు.
అమృత్‌సర్ SSP మనీందర్ సింగ్ ips manidher singh మాట్లాడుతూ.. “నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోయారని మాకు సమాచారం అందింది. మేము వెంటనే దర్యాప్తు చేపట్టి, నలుగురిని అరెస్టు చేశాం. ప్రధాన సరఫరాదారు పరబ్జీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నాం.”
“అతడిని విచారించి.. కింగ్‌పిన్ సరఫరాదారు సహబ్ సింగ్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత అతడిని కూడా అరెస్టు చేశాం. అతను ఏయే సంస్థలకు ఈ మద్యం సరఫరా చేశాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం. నకిలీ మద్యం సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం నుంచి మాకు కఠినమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి.” అని తెలిపారు.
“దాడులు జరుగుతున్నాయి.. త్వరలో తయారీదారులను పూర్తిగా అదుపులోకి తీసుకుంటాం. తాజా కేసులో కఠినమైన సెక్షన్ల కింద రెండు FIRలు నమోదు చేశాం. పౌర పరిపాలన, మరిన్ని ప్రాణ నష్టాలను నివారించడానికి, ప్రజలను కాపాడటానికి, కల్తీ మద్యం తాగిన వారిని కనుగొనడానికి మేము ఇంటింటికీ వెళ్తున్నాం. 14 మరణాలు నిర్ధారించబడ్డాయి. ప్రస్తుతం ఆరుగురు ఆసుపత్రిలో ఉన్నారు. ఈ ఘటన 5 గ్రామాల్లో జరిగింది..” అని పోలీసు అధికారి వివరించారు.