HomeUncategorizedJagannath Rath Yatra | జగన్నాథ్​ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురి దుర్మరణం

Jagannath Rath Yatra | జగన్నాథ్​ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురి దుర్మరణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jagannath Rath Yatra : ఒడిశా (Odisha)లో విషాదం చోటుచేసుకుంది. పూరీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra)లో మరోసారి అపశృతి జరిగింది. ఆదివారం(జూన్​ 29) తెల్లవారుజామున తొక్కిసలాట జరిగి, ముగ్గురు భక్తులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

తొక్కిసలాటలో మరణించిన వారిని ప్రేమకాంత మొహంతి(80), బసంతి సాహు(36), ప్రభాతి దాస్​(42)గా గుర్తించారు. మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.

Jagannath Rath Yatra : ఇటీవలే అహ్మదాబాద్​లో..

ఇటీవల అహ్మదాబాద్​ రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన మూడు ఏనుగులు అదుపుతప్పి ఒక్కసారిగా భక్తుల పైకి దూసుకురావడంతో తోపులాట చోటుచేసుకుంది. భారీ ఏనుగులు దూసుకురావడంతో భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటన మరువకముందే మరోటి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. పూరి రథయాత్ర కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి ప్రాంత పరిసరాలు కోలాహలంగా మారాయి.

Must Read
Related News