అక్షరటుడే, హైదరాబాద్ : Hyderabad | హైదరాబాద్ (Hyderabad)లో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని మియాపూర్ (Miyapur)లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మియాపూర్ ఠాణా పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్లో ఈ దారుణ ఘటన జరిగింది.
మియాపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హన్సిక (14) పదో తరగతి చదువుతోంది. గురువారం ఆమె తాను నివసించే అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.