అక్షరటుడే, వెబ్డెస్క్ : Medchal | మేడ్చల్ జిల్లాలో (Medchal district) విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ (water tanker) ఢీకొని ఏఎస్సై మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా (Vikarabad district) పెద్దముల్‌కు చెందిన దేవిసింగ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్నాడు.
శనివారం ఆయన విధులకు హాజరయ్యాడు. స్టేషన్ ఆవరణలో నిలబడి ఉండగా.. ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకర్ వాహనం ఆయనను ఢీకొంది. శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన దేవిసింగ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
