Homeక్రైంMedak | మెదక్ జిల్లాలో విషాదం.. అత్యాచారానికి గురైన మహిళ మృతి

Medak | మెదక్ జిల్లాలో విషాదం.. అత్యాచారానికి గురైన మహిళ మృతి

Medak | మెదక్​ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medak | మెదక్​ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళకు పని ఇస్తామని చెప్పి తీసుకెళ్లి దుండగులు అత్యాచారం చేశారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ, ఆమె భర్త అడ్డా కూలీలుగా పని చేస్తూ జీవిస్తున్నారు. సదరు మహిళ నిత్యం గ్రామం నుంచి మెదక్​కు పని కోసం వస్తుంటుంది. శుక్రవారం సైతం ఆమె పనికి రాగా.. కొందరు వ్యక్తులు పని ఇప్పిస్తామని నమ్మించారు. అనంతరం ఆమెను ఏడుపాయల (Edupayala) శివారులోని ఓ వెంచర్​లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు.

Medak | రాత్రంతా కొనఊపిరితో..

నిందితులు ఆమెను అత్యాచారం చేసి, రాళ్లతో దాడి చేశారు. చేతులను స్తంభానాకి కట్టేశారు. అనంతరం చనిపోయిందనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ మహిళ శుక్రవారం రాత్రి కొన ఊపిరితో వెంచర్​లో కొట్టుమిట్టాడింది. శనివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆమెను మెదక్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి హైదరాబాద్​ తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలో మృతి చెందింది.

Medak | దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మహిళ హత్యాచారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్​ డీఎస్పీ ప్రసన్నకుమర్​ (DSP Prasanna kumar) ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ మహిళ వెళ్లిన మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.